AP PRC Agitation Postpone |ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం.. ఆందోళన వాయిదా!
AP PRC Agitation Postpone | ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హామీతో ఏపీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ఆందోళనను వాయిదా వేశాయి

AP PRC Agitation Postpone | వేతన సవరణపై ఆందోళన బాట పట్టిన ఏపీ ప్రభుత్వోద్యోగ సంఘాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు, డిమాండ్లు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరామని అన్నారు.
ఈనేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మలతోనూ చర్చించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలోకి వెళ్లామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు చెప్పారు. ఆర్థికేతర డిమాండ్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా పీఆర్సీ ఖరారు, ఇతర డిమాండ్లపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

