అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ( Andhra Pradesh ) సంచలన నిర్ణయం తీసుకుంది. మున్నెన్నడు లేని విధంగా 43 మంది వైద్యులను డిస్మిస్ (Doctors Dismiss ) చేసింది . మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు గాను వారిపై సంజాయిషీ నోటీసులు, అభియోగాలు నమోదు చేసినా స్పందించకపోవడంతో విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.