PDS Rice | ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్ చీఫ్‌గా ఆరుగురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమా మహేశ్వర్, డీఎస్పీలు అశోక్‌వర్దన్, గోవిందరావు, బాలసుందర్ రత్తయ్య కొనసాగనున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌కు విస్తృత అధికారాలు కల్పించింది. ఏ ప్రభుత్వం నుంచైనా సమాచారం తీసుకునే అధికారాన్ని ఇచ్చింది. సాక్షుల విచారణ, డాక్యుమెంట్ల సీజ్‌తో పాటు నిందితులను అరెస్టు చేసేలా సిట్‌కు అధికారాలు కల్పించింది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. త్వరలోనే సిట్ టీమ్ సమావేశం ఉంటుందని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈలోపు ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తామని పేర్కొన్నారు. గతంలో నమోదైన 13 కేసుల వివరాలతో పాటు అక్రమ రవాణా అనుమతుల పత్రాలను పరిశీలిస్తామని చెప్పారు. తొందరపడి హడావుడి చేయాల్సిన అవసరం లేదన్నారు. సమగ్ర విచారణ జరిపి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.