AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించింది. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని జీఏడీ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలు వినియోగించాలని పేర్కొంది.