AP News | ఏపీలోని సివిల్ సర్జన్ స్పెషలిస్టులకు పదోన్నతి లభించింది. 2024-25వ సంవత్సరానికి గానూ వీరికి ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పలువురిని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా రాపూర్ సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ వీ సరస్వతిని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏహెచ్‌కు బదిలీ చేశారు. ఒంగోలు ఎంసీహెచ్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఎం ఉషాబాలను నెల్లూరు జిల్లా కావలి ఏహెచ్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం ఏహెచ్ డాక్టర్ ఎన్ శైలజను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏహెచ్‌గా బిలీ చేశారు. తూర్పు గోదావరి కాళేశ్వరం సీహెచ్‌సీలో పనిచేఏస్తున్న డాక్టర్ వనజ కుమారిని రంపచోడవరం ఏహెచ్‌గా బదిలీ చేశారు. ఆర్డర్లు అందుకున్న 15 రోజుల్లో వారు ఆయా స్థానాల్లో జాయిన్ అవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.