APIIC | ఏపీలో పెట్టుబడుల కోసం విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇండిస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ)లో బోర్డు డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 15 మంది సభ్యులను బోర్డు డైరెక్టర్లుగా నియమించింనట్లు ఉత్తర్వుల్లో ఎన్.యువరాజ్ పేర్కొన్నారు. ఈ 15 మంది రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని తెలిపారు. ఈ మేరకు సంబంధిత కార్యాచరణ చేపట్టాలని ఏపీఐఐసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు.