Sankranti Holidays | ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ ( సోమవారం ) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులను విద్యా శాఖ ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు పండుగకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ సోమవారం నాడు పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని వెల్లడించింది. పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది.