Akhanda 2 | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అఖండ 2 : తాండవం సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100(జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరను రూ.600 ( జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. పెంచిన ధరలు విడుదల తేదీ (డిసెంబర్ 5 ) నుంచి పది రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.