హైదరాబాద్, మార్చి 2(నమస్తేతెలంగాణ): ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సునీల్‌కుమార్‌పై వచ్చిన అభియోగాలు, ఆరోపణలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా నేతృత్వంలో విచారణ చేపట్టిన ప్రభుత్వం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
2020 నుంచి 2024 మధ్య సునీల్‌కుమార్ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకుంది. జగన్ హయాంలో సునీల్సీఐడీ డీజీగా పనిచేశారు. రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేశారు. విచారణ పేరిట అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు చేశారు.