తిరుమల : ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (AP DGP) హరీష్ కుమార్ గుప్తా ( Harish Kumar Gupta) శుక్రవారం తిరుమలలో( Tirumala ) వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వద్ద అర్చకులు, అధికారులు డీజీపీకి స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీ వారి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు , లామినేటెడ్ లామినేటెడ్ ఫోటోను అందజేశారు. ఆలయ వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేదాశ్వీరచనం చేశారు. ఆయన వెంట సీవీఎస్వో వి. హర్షవర్ధన్ రాజు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం తదితరులు హాజరయ్యారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,019 మంది భక్తులు దర్శించుకోగా 37,774 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.42 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.