PM Modi Tour | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం పరిశీలించారు.
ప్రధాని మోదీ పర్యటించే ప్రదేశాలలో హెలీప్యాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. మోదీ పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డీజీపీ వెంట కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఉన్నారు.