అమరావతి : సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker ) రఘురామకృష్ణరాజు( Raghuramaksrishna raju ) అన్నారు. ఈమేరకు ట్విటర్లో(Twitter) పోస్టు చేశారు. ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదని తెలిపారు.
నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి (Revanthreddy) తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు. అర్జున్ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డా దాఖలాలు లేవని వెల్లడించారు . ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుందని అన్నారు.
శుక్రవారం అరెస్టు చేయడం అన్నది జగన్ మోహన్ రెడ్డి మోడస్ ఆపరెండి అని వ్యాఖ్యనించారు. గతంలో నన్ను కూడా అలానే అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చిన వారిని, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వారిని కూడా అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు.