Pawan Kalyan | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీకి బదులు ఒకటో తేదీనే పవన్ కల్యాణ్ తిరుమలకు రానున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ను జనసేన నేతలు వెల్లడించారు.
పవన్ కల్యాణ్ అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకుని పూజలు చేస్తారు. అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు. అలాగే అన్న ప్రసాద వితరణను పరిశీలిస్తారు. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ నెల 1వ తేదీన పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమణ నేపథ్యంలో ఇవాళ ఏపీలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించాలని, అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన సూచించింది. 2వ తేదీన నగర సంకీర్తన, 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది.