అమరావతి : ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సచివాలయంలో బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే సీఎస్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా గుండెవ్యాధితో బాధపడుతూ ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండురోజుల నుంచి ఆయన విధులకు హాజరవుతున్నారు.