అమరావతి: ఏపీ ప్రభుత్వం కోరిన మేరకు మరో 6 నెలల పాటు సీఎస్‌గా సమీర్‌శర్మను కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 2న ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆదివారం కేంద్ర యూనియన్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు. రెండు నెలల క్రితం సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ వచ్చే సంవత్సరం మే నెల వరకు పదవీలో కొనసాగనున్నారు.