అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రి మండలి సమావేశం ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరుగనుంది . సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటకు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనున్నారు.
ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించాల్సిన అంశాలను, ప్రతిపాదనలను నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 5న కలెక్టర్ల సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు. అన్ని జిల్లాల కలెక్టర్లు , ఈ సమావేశానికి హాజరుకానున్నారని సీఎస్ వెల్లడించారు.
AP High Court | ప్రతిపక్ష హోదా కోసం జగన్ పిటిషన్.. స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు