అమరావతి : ఏపీలోని విజయనగరంలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయానికి (Bhogapuram airport) అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) పేరుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఓటమికి ప్రధాన కారణమైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకు శాసనమండలి ఆమోదం తెలిపింది.
శాసన మండలి సమావేశాలు ఆఖరు రోజున మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. పదిరోజుల పాటు వివిధ బిల్లులపై మండలిలో చర్చ కొనసాగింది. చివరి రోజూ ఈ బిల్లులపై మండలి చైర్మన్ మోషన్రాజు బిల్లులకు మెజారిటీ సభ్యుల కోరిక మేరకు ఆమోదం తెలిపింది.
ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు, పీడీ యాక్ట్ ( PD Act) సవరణ బిల్లు, సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు, చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు 2024కు మండలి ఆమోదం తెలిపింది .