Vijayasai Reddy | ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ ఛీప్ వైఎస్ షర్మిలతో మూడు రోజుల క్రితం సీక్రెట్‌గా సమావేశమైనట్లు తెలుస్తోంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విజయసాయి రెడ్డి.. షర్మిలను కలిశారనే విషయం ఇప్పుడు వైసీపీలో కలకలం రేపింది.
మూడు రోజుల క్రితం విజయసాయిరెడ్డి హైదరాబాద్ వెళ్లి.. లోటస్‌పాండ్‌లోని షర్మిలను సీక్రెట్‌గా కలిశారని ఒక వార్త బయటకొచ్చింది. దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై వారిద్దరూ రాజకీయ అంశాలపై చర్చించారని సమాచారం. అంతేకాదు మధ్యాహ్నం భోజనం కూడా షర్మిల ఇంట్లోనే చేశారని తెలుస్తోంది. ఎంత సీక్రెట్‌గా వీళ్ల భేటీ జరిగినప్పటికీ.. ఏదోలా ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కింది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందని వైసీపీ శ్రేణులతో పాటు మిగతా పార్టీలు ఆశ్చర్యపోయి చూస్తున్నాయి.
జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. అన్ని వేళలా ఆయనకు అండగా ఉన్నారు. గతంలో అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తలెత్తినప్పుడు కూడా జగన్‌కు మద్దతిస్తూ.. షర్మిలతో విబేధించారు. అది కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయి చేసిన ప్రకటనపైనా అభ్యంతరం తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిజాలు బయటపెట్టాలని కూడా షర్మిల సూచించారు. షర్మిలపై విజయసాయి కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇలా ముందు నుంచి విబేధాలతో ఉన్న వీరు.. ఇప్పుడు భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చలకు తావిస్తోంది.