అమరావతి : డిసెంబర్ 3,4 తేదీల్లో జరగాల్సిన ఏపీ కలెక్టర్ల సదస్సు (Collectors Conference) వాయిదా పడింది. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 4న మంత్రి వర్గ సమావేశం (AP Cabinet) నిర్వహిస్తున్న దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
4న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాక్లో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రిచంద్రబాబు అధ్యక్షతన జరుగుతుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గ భేటీ సందర్భంగా కేబినెట్లో చర్చించే ప్రతిపాదనలు 2వ తేదీలోగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖలను ఆదేశించారు. కాగా కలెక్టర్ల సదస్సు 9,10వ తేదీల్లో నిర్వహించే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.