అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రెండోరోజు కేంద్ర హోంమంత్రి అమితిషాతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వీరి సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం . నిన్న ప్రధాని మోదీతో సమావేశమై వివరించిన రాష్ట్ర సమస్యలను అమిత్‌షాకు విన్నవించారు. రెవెన్యూ లోటు నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్ కోరారు.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో సవరణలు, అన్ని జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేయాలని కోరారు. 2014-15 రెవెన్యూలోటుతో పాటు 32,625 కోట్లు ఏపీ ప్రభుత్వానికి రావల్సి ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను మంజూరు చేయాలని హోం మంత్రికి విన్నవించారు.