Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాశీబుగ్గ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తొక్కిసలాటలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. దర్శనానికి వెళ్తే ఇలా జరగడం బాధాకరమని విషాదం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. ప్రాణం చాలా విలువైనదని.. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని తెలిపారు.
కాశీబుగ్గలో ఓ వ్యక్తి వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని.. దీనిపై ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్లమని అన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తొక్కిసలాట జరిగి అమాయకులు చనిపోవడం బాధాకరం. చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను.
కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో, ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు గానీ, అధికారులకు గానీ… pic.twitter.com/fsNj0qNxzC
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2025