Chandrababu | పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని ఆధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన తర్వాత పోలవరం, అమరావతిని రెండు కళ్లుగా భావించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2014 నుంచి 2019 వరకు రేయింబవళ్లు కష్టపడి పనిచేశామని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలతో 2014లో అధికారంలోకి రాగానే ఏడు ముంపు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణం చేయనని చెబితే.. కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని గుర్తుచేశారు. ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు కూడా బ్రేక్ చేశామని తెలిపారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు రెండూ పూర్తి చేశామని పేర్కొన్నారు. డయాఫ్రం వాల్‌ను 414 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫ్రం వాల్‌కు కూడా శ్రీకారం చుట్టామని అన్నారు.72 శాతం పనులు కూడా పూర్తి చేశామని చెప్పారు.
రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతి, పోలవరం, రెండూ పొడిచేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసాడు. ఇప్పుడు ఒక్కోటి సెట్ చేసుకుంటూ వెలుగుని ఇస్తున్నాం. #PolavaramBackOnTrack#CBNinPolavaram#PolavaramProject#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/OJk4XCCT3E
— Telugu Desam Party (@JaiTDP) December 16, 2024
కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టర్‌ను మారుస్తామని చెప్పారని.. అదే ఏడాది జూలైలో బలవంతంగా నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని చంద్రబాబు తెలిపారు. 15 నెలల పాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 50 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసేలా మనం నిర్మాణం చేశాం కానీ.. ఆగస్టు, అక్టోబర్‌లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని విమర్శించారు. అసమర్థతత, అవగాహనరాహిత్యం, అవినీతి, కుట్రలతో ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు.
2021 నాటికి పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని, రివర్స్ పాలనతో మళ్ళీ మొదటికి తెచ్చారు. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి, పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని నాశనం చేసారు. #CBNinPolavaram #PolavaramProject #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/UIyuwwodrA
— Telugu Desam Party (@JaiTDP) December 16, 2024