అమరావతి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandra Babu ) ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని , రైతుల సమస్యలను పట్టించుకోరని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిటీషర్లు్ చేపట్టినే భూ సర్వే( Land Survey ) నే నేటికి కొనసాగుతు వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వ చేపట్టి రైతులకు పట్టా పుస్తకాలు అందజేశారని వెల్లడించారు.
భూముల కొలతల కోసం గ్రామ సర్వేయర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, డ్రోన్ల సహయంతో డాటాను సేకరించామని తెలిపారు. సుమారు 6వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి పట్టాలు అందించిన ఘనత జగన్కు దక్కుతుందని పేర్కొన్నారు. పట్టా పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం వల్ల రైతులకు తెలియకుండానే వారి భూములను విక్రయించుకునేందుకు వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని నాటి ప్రభుత్వాన్ని బదనాం చేశారని ఆరోపించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఎకరానికి కూడా సర్వే జరుపలేదని వెల్లడించారు. వైసీపీ హయాంలో వాడిన పరికరాలనే చంద్రబాబు ఎంతుకు వాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారని మండిపడ్డారు. అదృష్టం బాగుండి అనగాని మంత్రి అయ్యారని తెలిపారు.