ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) తన రెండురోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబుకు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. సెప్టెంబర్ మొదటివారంలో ఏపీని వణికించిన వర్షాలు, వరదల తరువాత ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇదే ప్రథమం.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ని కలిసి చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానం అమరావతి(Amaravati) , పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు చర్చించినట్లు సమాచారం.
సెయిల్‌లో విశాఖ స్టీల్ విలీనం, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా రేపు (మంగళవారం) పలువురు కేంద్ర మంత్రు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ , పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురితో కలువనున్నారు.