Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్నందుకు ఆయనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని అన్నారు. కాకినాడ సెజ్‌కు సంబంధించి కేవీ రావుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ పోర్టులో చంద్రబాబు నిజంగా తప్పు చేసి ఉంటే గత ఐదేళ్లలో ఏం చేశారని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. నువ్వో పెద్ద బ్రోకర్‌వి అని విమర్శించారు. నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకుని వచ్చి కేసు పెట్టు.. పోలీసులు విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు.
మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబును జైలుకు పంపిస్తావా అని విజయసాయి రెడ్డిని హెచ్చరిస్తావా అని ఆనం వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలు వింటుంటే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని భయం వేస్తుందని తెలిపారు. వీళ్లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. జగన్‌కు విజయసాయిరెడ్డి ఒక చెంచా అని విమర్శించారు. ఏ వాల్యుయేషన్‌తో కాకినాడ సెజ్‌లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29వేల చొప్పున కొట్టేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. గన్ పెట్టి బెదిరించి కొట్టేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
వేల కోట్ల ఆస్తి కేవలం రూ.12 కోట్లకి నువ్వు కొట్టేసావని, నీ అక్రమాలు బయట పెడితే, చంద్రబాబు గారిని చంపేస్తా అని, నీ చెంచాలతో బెదిరిస్తావా @ysjagan ?#YCPFakeBrathuku#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/ebVskH4YJd
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024
నిన్న ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి భాష సరిగ్గా లేదని మండిపడ్డారు. అందుకే ఆయన భాషలోనే మాట్లాడుతున్నానని చెప్పారు. అందుకు తనను క్షమించాలని కోరారు. విజయసాయిరెడ్డిని ఒక బ్రోకర్ అని విమర్శించారు. కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని నిలదీశారు.