No-VehicleS Friday | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు నో వెహికల్ ఫ్రైడేగా పాటించాలని సూచన
No-VehicleS Friday | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గంలో ప్రధానంగా ప్రధాని మోదీ పొదుపు చర్యలపై చర్చించారు.
అమరావతి : ఏపీ కేబినెట్(AP Cabinet ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గంలో ప్రధానంగా ప్రధాని మోదీ పొదుపు చర్యలపై చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వాహనాల శ్రేణిని, వాహనాల వాడకాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి కోరారని మంత్రి పార్థసారథి ( Minister Parthasarathi ) వెల్లడించారు.
రాష్ట్రంలో సైకిళ్ల వాడకాన్ని పెంచాలని, లేదా పాదయాత్రగా సమీప ప్రాంతాలకు వెళ్లాలని, వారానికి ఒకరోజు నో వెహికల్ ఫ్రై డే ( No-Vehicle Day ) ను పాటించాలని , ఈవీ వాహనాలను వాడేవారిని ప్రోత్సహించాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోంపై సాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారని వెల్లడించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజారవాణాను ప్రోత్సహించాలని, విదేశి పర్యటనలను తగ్గించుకోవాలని సూచించారని ఆయన తెలిపారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 40కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

