AP Cabinet | మరోసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవ్వనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏపీ పర్యటన, జీఎస్టీ సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం జీఎస్టీపై కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో నిర్వహించనున్న జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్ సమావేశంలో మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ చర్చించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఇటీవల పలువురు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో వాటిపై, అలాగే సోషల్ మీడియా ప్రచారంపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం.