అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం (AP Cabinet ) ఈనెల 18న జరుగనుంది . ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం సాయంత్రంలోగా అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 18న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరుగునుంది. ఇటీవల ఏపీలో సంబవించిన వరదలు, భారీ వర్షాలకు జరిగిన నష్టంపై చర్చ, బాధితులకు పరిహారంతో పాటు మరికొన్ని పథకాలపై సుదీర్ఘంగా చర్చింది నిర్ణయం తీసుకోనున్నారు.