AP Assembly | రెండు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం
AP Assembly |

అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ క్రమబద్ధీకరణ సవరణ బిల్లును మంత్రి పేర్నినాని బుధవారం సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్‌లో ఇకనుంచి టికెటింగ్‌కు అనుమతి లేదు. సీఎం వైఎస్ జగన్ తరఫున బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.
ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించనుంది. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధన విధించారు. బెనిఫిట్ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేయనున్నారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌లను పెంచుతూ సవరించారు. కొత్త వాహనాలకు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు లైఫ్ ట్యాక్స్ పెంచారు. దీంతో ప్రజలపై రూ.409 కోట్ల అదనపు భారం పడనుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు రూ.4వేల నుంచి రూ.6 వేల వరకు గ్రీన్ టాక్స్ విధిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

