e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ఏపీ బ‌డ్జెట్ రూ. 2,29,779 కోట్లు

ఏపీ బ‌డ్జెట్ రూ. 2,29,779 కోట్లు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రాష్ర్ట బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ అసెంబ్లీలో ఇవాళ ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఏపీ బ‌డ్జెట్‌లో సంక్షేమ పథ‌కాల‌తో పాటు మ‌హిళల అభివృద్ధికి పెద్ద‌పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు
మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు
వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

- Advertisement -

విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు
కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు
పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement