AP Politics | ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీతోనే ఉన్నామని జనసేన కూడా చెప్పిందని గుర్తు చేశారు. నిన్న మొన్న కార్యకర్తలతో మాట్లాడి పొత్తులపై అభిప్రాయాలను సేకరించామని తెలిపారు.
అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఆ నివేదికను హైకమాండ్‌కు పంపిస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇది ఎన్నికలకు ఒక నెల ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.