అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని అసెంబ్లీ స్పీఎకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల, వ్యవసాయ పరివర్తన పథకం ద్వారా సుమారు 31,500 మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా తమ్మినేని సీతారాం రామచంద్రపురం సాగరం చెరువులో రొయ్యపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్య పరిశ్రమ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
స్థానికంగా ఉన్న మత్స్యకారులను ప్రోత్సహించి మత్స్య పరిశ్రమ పై ఉపాధి పెరగాలనే ఉద్దేశంతో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్స్ లు, లైట్లు, చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతోందని ఆయన వివరించారు.