AP Assembly | ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుతం అమలవుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే పలు కీలక బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. కాగా, అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.