అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న గవర్నర్ ప్రసంగం(Governor speech), ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Budget) ను ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.
6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో వైసీపీ ప్రభుత్వాని(YCP Govt)కి ఈ అసెంబ్లీ సమావేశాలే చివరి సమావేశాలు కానున్నాయి. మళ్లీ కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత సమావేశాలు జరగనున్నాయి.