AP Assembly | ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly | ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు ఈనెల 21, 22 తేదీల్లో జరుగనున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు(AP Assembly) ఈనెల 21, 22 తేదీల్లో జరుగనున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రకటించినప్పటికీని సమావేశాల తేదీని ముందుకు జరిపారు. సమావేశాల మొదటి రోజు కొత్తగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం(Sworn) , మరుసటి రోజు శాసనసభ స్పీకర్(Speaker), డిప్యూటీ స్పీకర్(Deputy Speaker) ఎన్నిక జరుగనుందని తెలిపారు.
రాష్ట్రంలో తెలుగుదేశం (Tdp) పార్టీ రెండోసారి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసి మొదటి సారి అధికారంలో రాగా 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటిరిగా పోటీచేసి ఓడిపోయింది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం 175కు 151 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టింది. టీడీపీ 23 స్థానాలతో, జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి రెండో సారి పోటీ చేసి అనూహ్య ఫలితాలను సాధించింది. 164 స్థానాల్లో కూటమి గెలుపొందగా వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

