అమరావతి : వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యాత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. అదే బాటలో మరో ఎంపీ కూడా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ (YCP MP) అయోధ్యరామిరెడ్డి ( AyodhyaRamireddy ) స్పందించారు. తాను పార్టీ మార్పు వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ (UP and Downs ) ఉంటాయని, ఎన్నికల్లో ఓడినప్పుడు వచ్చే ఒత్తిళ్లను తట్టుకుని నిలబడే వ్యక్తి అసలైన రాజకీయ నాయకుడని అన్నారు. ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుందని అన్నారు. విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) ఎందుకు పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
సాయిరెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగతమని వెల్లడించారు. కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి. నిలబడాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుందని అన్నారు. రాజకీయాల్లో నుంచి వచ్చిన వారికి కష్టాలు తెలుస్తాయి. ఇతర రంగాల నుంచి వచ్చిన వారికి ఆ కష్టాలు అంతగా తెలియవని పేర్కొన్నారు.