అమరావతి : తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. వరుసగా మూడురోజులు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలవరం రేపుతుంది. ఆదివారం రాత్రి రాడార్ సెంటర్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చింతామణి అనే జవాన్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోన్నాడు.
మరుసటి రోజు షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూంలో సి-షిప్ట్‌లో విధుల్లో ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్ తన వద్ద ఉన్న పిస్తోలుతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త వికాస్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక భార్య మంగళవారం రాత్రి నర్మద గెస్ట్‌హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలపై షార్ అధికారులు, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.