అమరావతి : విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం ఘటనను మరువకముందే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోవడంపై చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన రహమత్, షబానా దంపతులకు ఆస్పత్రిలో నిన్న మగ శిశువు జన్మించాడు. రాత్రి తల్లి పక్కనే నిద్రిస్తున్న శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఘటనపై స్పందించారు. పసికందు మాయంపై వేగంగా విచారణ చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యు ల ఫిర్యాదు మేరకు చిత్తూరు టు టౌన్ పోలీసులు ఆస్పత్రిలో సీసీ ఫుటేజిని పరిశీలించి నిందితుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.