అమరావతి : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన మ్యాన్‌హోల్ ప్రమాదంలో మరొక పారిశుద్ధ్య కార్మికుడు లచ్చన్న చికిత్స పొందుతూ ఇవాళ ఆస్పత్రిలో కన్నుమూశాడు. నిన్న తిరుపతిలోని వైకుంఠపురం జంక్షన్ వద్ద మ్యాన్ హోల్‌ను శుభ్రం చేసేందుకు దిగిన మహేశ్, ఆర్ముగం అనే ఇద్దరు కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగారు విషవాయువు కారణంగా తీవ్ర అస్వస్థతకు అక్కడే ఉండిపోయారు.
గమనించిన లచ్చన్నఅనే కార్మికుడు సైతం మ్యాన్ హోల్లో దిగగా అతడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని ముగ్గురిని బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ నిన్న మహేశ్, ఆర్ముగం మృతి చెందగా ఇవాళ లచ్చన్న స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా ఘటనపై స్పందించిన నగర కమిషనర్ అనుపమ అంజలి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈకి షోకాజ్ నోటీసు జారీ చేసి పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు.