Astrologer | జాను మిస్సింగ్ కేసు.. పాప ఈ లొకేషన్లో ఉందంటూ మరో జ్యోతిష్యుడి హల్ చల్.. వీడియో
Astrologer | ఇటీవలే ఓ జ్యోతిష్యుడు పాప జ్ఞానేశ్వరి భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే తిరిగి వస్తుందంటూ అర్థరాత్రి ఆ పాప ఇంటిపైకి ఎక్కి హల్ చల్ చేశాడని తెలిసిందే. చిన్నారి ఇంటి వద్ద మరో జ్యోతిష్యుడు హల్ చల్ చేశాడు.
Astrologer | కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం దొండవాకలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 19 రోజులైనా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు చిన్నారి కోసం బృందాలుగా గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ నుంచి వచ్చినట్టు చెప్పుకున్న ఓ జ్యోతిష్యుడు పాప జ్ఞానేశ్వరి భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే తిరిగి వస్తుందంటూ అర్థరాత్రి ఆ పాప ఇంటిపైకి ఎక్కి హల్ చల్ చేశాడని తెలిసిందే.
తాజాగా చిన్నారి ఇంటి వద్ద మరో జ్యోతిష్యుడు హల్ చల్ చేశాడు. చిన్నారిని తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై, సెప్టెంబర్ నెలలోపు తిరిగి వస్తుందని జోష్యం చెప్పాడు. అంతేకాదు చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, కొందరు ఆమెను తీసుకెళ్లారు.. ఆమెకు ఎలాంటి హానీ జరుగలేదు. పాప ఎక్కడున్నా సురక్షితంగానే ఉంది. ఆమె పక్కా దొరికేస్తదని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. అమ్మాయి ఈ లొకేషన్లో ఉందంటూ సదరు జ్యోతిష్యుడు చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
చిన్నారి జాను ఇంటి వద్ద ఇంకో జ్యోతిష్యుడు హల్చల్
చిన్నారిని తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై, సెప్టెంబర్ నెలలోపు తిరిగి వస్తుందని జోతిష్యం
చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, కొందరు తీసుకెళ్లినట్లు తెలిపిన జ్యోతిష్యుడు
కాగా చిన్నారి జాను అదృశ్యమై 19 రోజులైనా దొరకని… https://t.co/UGbXarjI3O pic.twitter.com/iIZg3MtKXP
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

