Srisailam ఁ శ్రీశైల మల్లన్నకు వార్షిక ఆరుద్రోత్సవ పూజలు
Srisailam | శ్రీశైల మల్లిఖార్జునుడికి శుక్రవారం వార్షిక ఆరుద్ర ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా వార్షిక ఆరుద్రోత్సవ పూజలు నిర్వహించామని ఈవో ఎస్ లవన్న తెలిపారు. ధనుర్మాస ఆరుద్ర నక్షత్రంలో భాగంగా గురువారం రాత్రి పది గంటల నుండి గర్బాలయంలో మల్లన్నకు పంచామృతాభిషేకాలు, షోడశోపచార ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. వివిధ రకాల పుష్పాలు ఫలాలను నేవేద్యంగా సమర్పించారు.

వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన అభిషేక పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ప్రాత:కాల పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా వేంచెంబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

అటుపై నందివాహనం పై ఆదిదంపతుల ఉత్సవ మూర్తులను ఆసీనులను గావించి గ్రామోత్సవం జరిపించారు.

గంగాధర మండపం నుండి నంది మండపం మీదుగా బయలు వీరభద్ర స్వామి వరకు సాగిన గ్రామోత్సవంలో ఆద్యంతం భక్తులకు కనువిందు జేసింది. నందివాహవాధీశులైన దేవదేవురులు భక్తులను కటాక్షించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

