విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు : ఏపీ విద్యాశాఖ మంత్రి
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు | విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అన్నివిధాలా ఆలోచించే పరీక్షలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విజయవాడ : విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అన్నివిధాలా ఆలోచించే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షెడ్యూల్ ప్రకారం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,452 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ చేసి సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. నేటి నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, హాల్టికెట్లపైనా కొవిడ్ నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.
పరీక్షలు నిర్వహించకపోతే భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేవలం పాస్ సర్టిఫికెట్తో విద్యార్థులకు ఏం ప్రయోజనమని అన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

