అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శాసనసభా సమావేశాలు ముగిసాయి. 16వ శాసన సభా సమావేశాలు ( Legislative Sessions) రెండు రోజుల పాటు కొనసాగాయి. తొలిరోజు శుక్రవారం 175 మంది ఎమ్మెల్యేలకు(MLAs) గాను 172 మందిచే ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించగా మరోముగ్గురు శనివారం ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan), మరో 23 మంది మంత్రులు , వైసీపీ నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
స్పీకర్(Speaker)గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిన శనివారం రెండో రోజు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి అభినందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు మంత్రిగా పనిచేసిన అయ్యనపాత్రుడి సేవలను కొనియాడారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ నేత వైఎస్ జగన్ తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఎన్నికైతే సమావేశాలకు జగన్ వచ్చి అభినందించాల్సి పోయి గైర్హాజరు అయి అవమానించారని పేర్కొన్నారు.