Dharma Reddy | టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు..!
Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది.
Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆ ఇద్దరికి సహకరించిన ఇతర ఉద్యోగులను సైతం విచారించాలని ఆదేశాల్లో పేర్కొంది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు, విజయ్‌కుమార్‌రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ఫిర్యాదులు చేశాయి.
ధర్మారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ చేయగా.. విజయ్‌కుమార్‌రెడ్డి ఇటీవల కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారు. మళ్లీ తిరిగి వచ్చారు. టీటీడీని అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా కాంట్రాక్టులు ఇచ్చారని ధర్మారెడ్డిపై ఆరోపణలున్నాయి. శ్రీవాణి టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. సమాచార శాఖలో అవినీతికి పాల్పడ్డారని విజయ్‌కుమార్‌పై ఆరోపణలు ఉండగా.. ప్రకటనల పేరుతో రూ.కోట్ల మేర విజయ్ కుమార్ అవినీతికి పాల్పడ్డట్లుగా విమర్శలున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

