Anchor Shyamala | ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జగన్ కోసం.. వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌పై శ్యామల చేసిన విమర్శలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై అటు టీడీపీ.. ఇటు జనసేన అభిమానులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మీ సంగతి చెబుతామన్నట్లుగా వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. అయితే అన్నట్టుగా ఏపీలో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో పలువురు టీడీపీ, జనసేన అభిమానులు యాంకర్ శ్యామలను టార్గెట్ చేసి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలో శ్యామల ఓ వీడియో ద్వారా స్పందించారు. ఒకవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెబుతూనే.. బెదిరింపు కాల్స్‌తో భయమేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘ ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు.. ముందుగా అఖండ విజయం సాధించిన కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి గారికి హార్ధిక శుభాకాంక్షలు. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎస్.. మేం ఓడిపోయాం.. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. గెలిచిన నాడు విర్రవీగలేదు.. ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా జగన్ మరింత బలాన్ని పుంజుకుని.. మనందరం కలిసి జగనన్నతో నడిస్తే.. మళ్లీ క్చితంగా మంచి ప్రభుత్వంలా ఏర్పాటు చేస్తాం. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ జగనన్నతోనే నా ప్రయాణం. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’ అని శ్యామల చెప్పింది.
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే..
ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా..ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమం…ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. pic.twitter.com/tEfjUmshLW
— Anchor Shyamala (@AnchorShyamala) June 7, 2024
‘ చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఒక రకమైన భయంగానే ఉంది. మీకు ఒకటి నచ్చుతుంది.. నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చనిది నాకు నచ్చింది చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే.. ఇది చాలా అన్యాయం అన్న.. ప్లీజ్ దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు.. ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. ఎప్పటికీ చేయను కూడా. ఎవరన్నా నాకు చాలా గౌరవం. దయచేసి ఏదీ పర్సనల్‌గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశా. ఉన్నదే చెప్పాను.. లేనిది ఎక్కడ చెప్పలేదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా.’ అంటూ శ్యామల రిక్వెస్ట్ చేసింది.