అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ( Student Suicide) కలకలం రేపుతుంది. చరణ్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి నారాయణ కళాశాలలో (Narayana College ) చదువుతున్నాడు.
గురువారం కళాశాలలో తరగతులు నడుస్తుండగా, అందరూ చూస్తుండగానే బయటకు వచ్చి మూడవ అంతస్తు రేలింగ్ నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో చనిపోయాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనను నిర్వహించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కళాశాల ఎదుట బందోబస్తును ఏర్పాటు చేశారు.