హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును ‘ఆపరేషన్ గజ’తో అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించాయి. చిత్తూరు జిల్లా రామాపురం వద్ద ఏనుగు సంచరిస్తున్నదని సమాచారం మేరకు గాలింపు మొదలు పెట్టారు. చెరుకుతోటలో ఉన్న ఏనుగును గమనించి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. ఈ ఏనుగు దాడిలో దంపతులతో పాటు మరో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.