తిరుపతి : కేంద్ర హోం మంత్రి అమిత్షా ( Union Minister Amit Shah) తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం రాత్రి తమిళనాడు(Tamilnadu) లోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రాxe ఏపీ బీజేపీ (BJP) నాయకులు అమిత్ షాకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల (Tirumala) కు చేరుకోనున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేయనున్నారు.
శుక్రవారం ఉదయం కేంద్రమంత్రి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి, తిరుమలలో ఆయన నివసించే అతిథిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమిగా ఏర్పడి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలుమార్లు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమమం.