Ambati Rambabu | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీమంత్రి, వైసీపీ సీనియర్నేత అంబటి రాంబా బు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘పూర్తి పరిషారానికి సోఫా చేరాల్సిందే..!’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సోఫా పంపడం అనే ది ఇటీవల పుష్ప-2 సినిమాతో పాపులర్ అయింది.
తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను దారికి తెచ్చుకునేందుకు, అనుకూలంగా పనిచేసేవాళ్లకు బహుమానంగా సినిమాలో అల్లు అర్జున్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టిన ‘సోఫా’ పంపిస్తుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు పూర్తి పరిష్కారానికి సో ఫా చేరాల్సిందే అని ఏ ఉద్దేశంతో అ న్నారు? ఎవరిని ఉద్దేశించి అన్నారు? అనే అంశంపై ఎక్స్ వేదికగా చర్చ నడుస్తున్నది. కొందరు ‘సోఫా’ పంపితేనే సినీఇండస్ట్రీ సమస్యలకు పరిషారం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ‘పుష్ప వివాదానికి.. పుష్పరాజ్ తరహాలోనే పరిషారమా?’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.