హైదరాబాద్, జనవరి31(నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ మంత్రి అం బటి రాంబాబు ఇం టికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టాయి. సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటికి చేరుకొని ఫర్నిచర్‌ను, కిటీకీల అద్దాలను, కార్లను ధ్వంసం చేశారు. అంతేగాక ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టారు. 6 గంటలపాటు కర్రలు, రాడ్లు చేతబట్టుకొని వీరంగం సృష్టించారు.
ఆ రాష్ట్ర పోలీసులు శనివా రం రాత్రి అంబటిని అరెస్టు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిది లేదని తేల్చి చెప్పింది. దీంతో వేంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద పాప ప్రక్షాళనకు వైసీపీ పిలుపు ఇచ్చింది.